Thangalaan Movie | పార్వతి తిరువొతుకు బర్త్ డే విషెస్ తెలిపిన ‘తంగలాన్’ టీమ్
Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను మొదట జనవరి 26 విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు పా.రంజిత్ వెల్లడించాడు. అయితే మూవీ నుంచి కొత్త అప్డేట్ రాక చాలారోజుల అవుతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న మలయాళం హీరోయిన్ పార్వతి తిరువొతు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ పార్వతికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

