Thangalaan Movie | ‘తంగలాన్’ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే : పా.రంజిత్
Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమాను మొదట జనవరి 26 విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచుస్తుండగా మూవీ విడుదలపై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దర్శకుడు పా. రంజిత్‌ను మీడియా ‘తంగలాన్’ విడుదల ఎప్పుడు అని అడుగగా.. రంజిత్ స్పందిస్తూ.. తంగలాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా అని పా.రంజిత్ పేర్కొన్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

