Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘ఐ’ వంటి సినిమాలతో ఇక్కడ విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగులో విక్రమ్‌కు టాలీవుడ్ హీరోలకున్నంత క్రేజ్ ఉంది. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించడం లేదు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను ఖుషి చేసేందుకు విక్రమ్ తంగలాన్‌తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రాన్ని జనవరి 26 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని సమాచారం. తంగలాన్ సినిమాకు సంబంధించిన సీజి వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదట. దాంతో మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.