దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘వారసుడు’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో విజయ్, కథానాయిక రష్మిక మందన్న, సీనియర్ నటి ఖుష్భూ సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ‘ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. విజయ్ అభిమానుల్ని అలరించే అన్ని అంశాలుంటాయి. అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, కథ, స్క్రీన్‌ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.