Thalapathy Vijay | తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ప్రస్తుతం తన తొలి సినిమా ‘సిగ్మా’ (Sigma) ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. సందీప్ కిషన్ హీరోగా, లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో జేసన్ సంజయ్ తన కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఉన్న అనుబంధం గురించి ఆయన చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
తన జీవితంలో అమ్మ సంగీత పాత్ర ఎంత ముఖ్యమైనదో చెబుతూ జేసన్ భావోద్వేగానికి గురయ్యారు. “మా అమ్మ నా జీవితంలో అతిపెద్ద పిల్లర్. ఆమె రోజులో 24 గంటలూ నన్ను, మా చెల్లెలి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు నేను ఆమెకు ఫోన్ చేయడం మర్చిపోతే చాలు, వెంటనే ఆమె నాకు రీచ్అవుట్ అయి ‘ఈరోజు ఏం జరిగింది? అంతా బానే ఉందా?’ అని ఆరా తీస్తుంది” అంటూ అమ్మ ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. అలాగే తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. అమ్మ, నాన్నల దగ్గర కొన్ని విషయాలు పంచుకోవడానికి తాను కొంచెం భయపడతానని, ఎందుకంటే ఆ తరహా ఫ్రీ స్పేస్ వాళ్ళు తనకు చిన్నప్పుడు ఇవ్వలేదని నవ్వుతూ చెప్పారు. అయితే పేరెంట్స్‌తో చెప్పలేని ఎన్నో విషయాలను తాను తన సోదరితో మాత్రమే పూర్తిగా పంచుకుంటానని, ఆమె తన బెస్ట్ కాన్ఫిడెంట్ అని వెల్లడించారు.
ఇక నాన్న విజయ్ గురించి చెబుతూ.. తన తండ్రి గురించి తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఇండస్ట్రీలో ఎవరి ప్రమేయం లేకుండా సొంతంగా కష్టపడి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని విజయ్ తనకు సూచించినట్లు జేసన్ గుర్తుచేసుకున్నారు. కాగా, జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
#JasonSanjay recent:
“My mom is the huge piller in my life. She will be 24/7 thinking about me and my sister. If I forgot to call her for the day, she will reeach out and ask update what happened today♥️. With My Amma & Appa, I’m little scared to share everything, as they didn’t…— AmuthaBharathi (@CinemaWithAB) August 21, 2026