Thalapathy Vijay | కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ ఫార్మాలిటీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ, పలు న్యాయపోరాటాల అనంతరం ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు (CBFC) ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం మొత్తం 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ రన్టైమ్తో థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
తీవ్రమైన రాజకీయ నేపథ్యం ఉన్న కథాంశం కావడంతో, సెన్సార్ బోర్డు సూచనల మేరకు విజయ్ క్యారెక్టర్ పేరు ఆధారంగా వచ్చే ‘టీవీకే’ (TVK) డైలాగ్స్ రెఫరెన్స్‌లతో పాటు మరికొన్ని వివాదాస్పద సీన్లను మేకర్స్ మార్చడం లేదా మ్యూట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజూ కీలక పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. వీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఈ భారీ చిత్రాన్ని నిర్మించింది. అయితే మొదట ఈ సినిమాను జూలై 24న విడుదల చేయాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విడుదల తేదీ వాయిదా పడింది. త్వరలోనే సరికొత్త అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పష్టం చేసింది.
See you soon in theatres nanba & nanbis ❤️#JanaNayaganCensoredA 💥
Hon’ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412 @TSeries@PharsFilm @PicturesPVR @kamalgianc… pic.twitter.com/Rcx4Iuw52P
— KVN Productions (@KvnProductions) July 11, 2026