కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘వారసుడు’. విజయ్ నటిస్తున్న 66వ చిత్రమిది. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత సహ నిర్మాతలు. వంశీ పైడిపల్లి దర్శకుడు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ఆదివారం ప్రారంభమైంది. మొత్తం సినిమా షూటింగ్లో రెండు యాక్షన్ సీక్వెన్సులు, రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వీటి చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కార్తీక్ పళని, సంగీతం : ఎస్ థమన్.