అదే చివరి సినిమా
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ‘తమిళ వెట్రి కజగం’ పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికలే లక్ష్యంగా తమ పార్టీ కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు.
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ‘తమిళ వెట్రి కజగం’ పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికలే లక్ష్యంగా తమ పార్టీ కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు. క్రియాశీలక రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే యోచనలో ఉన్న విజయ్ తన 69వ సినిమా పూర్తిచేసిన అనంతరం సినీ రంగానికి గుడ్‌బై చెప్పనున్నట్లు పార్టీ ప్రకటన రోజునే వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) చిత్రంలో నటిస్తున్నారు.
ఆయనకు ఇది 68వ చిత్రం. వెంకట్‌ప్రభు దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా పూర్తయిన వెంటనే 69వ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా కోసం పలువురి దర్శకుల పేర్లు తెరపైకొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వెట్రిమారన్ ఈ చిత్రాన్ని డెరెక్ట్ చేయబోతున్నారని తెలిసింది. సామాజిక సమస్యల్ని తనదైన పంథాలో వెండితెరపై ఆవిష్కరించే వెట్రిమారన్.. విజయ్ పొలిటికల్ ఎంట్రీని దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని తెలుగు అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య తెరకెక్కించబోతున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

