Thalapathy Vijay | దళపతి విజయ్ చివరి సినిమా ఇదేనా..?
Thalapathy Vijay | కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రీసెంట్గా ‘తమిళ వెట్రి కళగం' (Tamizha Vetri Kazhagam) అంటూ పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఈ పార్టీ 2024 ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని విజయ్ తెలిపాడు. జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
Thalapathy Vijay | కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రీసెంట్గా ‘తమిళ వెట్రి కళగం’ (Tamizha Vetri Kazhagam) అంటూ పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఈ పార్టీ 2024 ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని విజయ్ తెలిపాడు. జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక తన చివరి సినిమా కూడా దళపతి 69 అని చెప్పాడు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు.
అయితే అలా అనౌన్స్ చేశాడో లేదో విజయ్ తర్వాత ఆ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు విజయ్ సినిమాలు మానేయడం తమిళ సినిమా బిజినెస్‌కు బాగా దెబ్బపడుతుందని.. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం ఇక్కడ మంచి బిజినెస్‌ను చేస్తాయని మాట్లాడుకుంటున్నారు. ఇదిలావుండగా విజయ్ చివరి సినిమా దళపతి 69పై అందరిలోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఆడియెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకుంటే విజయ్ లాస్ట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది మన తెలుగు నిర్మాత డి.వి.వి దానయ్య.
ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే.. దానయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే విజయ్ లాస్ట్ సినిమా టాలీవుడ్ రీమేక్ అని జోరుగా ప్రచారం సాగుతుంది. అది కూడా బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమా అని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భగవంత్ కేసరి లైన్ విజయ్‌కు బాగా నచ్చిందని.. అయితే కేవలం ఈ సినిమా కోర్ పాయింట్‌ను మాత్రమే మేకర్స్ తీసుకోబోతున్నారని, దానితో కొత్త కథను రెడీ చేస్తారని తెలుస్తుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, విజయ్ చివరి సినిమా పొలిటికల్ సబ్జెక్ట్‌తో కంప్లీట్ ఫ్రెష్ స్టోరీ అని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

