అభినవ రాజకీయ దళపతి
తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి అంకురార్పణ జరిగింది. అక్కడ చరిత్ర పునరావృతమవుతున్నట్లు కనిపిస్తున్నది. ఎం.జీ. రామచంద్రన్ తర్వాత మళ్లీ ఓ సినీనటుడు తమిళ రాజకీయ యవనికపై ప్రభవించారు. ముఖ్యమంత్రి పీఠాధిరోహణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. తమిళ వెండితెర సమ్మోహనాస్త్రం ‘జోసఫ్ విజయ్ చంద్రశేఖర్' పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. కింగ్ మేకర్ మాత్రమే అయ్యే అవకాశాలున్నాయంటూ వెలువడిన జోస్యాలన్నింటిని తలక్రిందులు చేస్తూ ఏకంగా ‘కింగ్' అయ్యారు దళపతి విజయ్. ఇక ఆయన తమిళనాట అధికారపీఠాన్ని కైవసం చేసుకోవడం లాంఛనమే.
తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి అంకురార్పణ జరిగింది. అక్కడ చరిత్ర పునరావృతమవుతున్నట్లు కనిపిస్తున్నది. ఎం.జీ. రామచంద్రన్ తర్వాత మళ్లీ ఓ సినీనటుడు తమిళ రాజకీయ యవనికపై ప్రభవించారు. ముఖ్యమంత్రి పీఠాధిరోహణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. తమిళ వెండితెర సమ్మోహనాస్త్రం ‘జోసఫ్ విజయ్ చంద్రశేఖర్’ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. కింగ్ మేకర్ మాత్రమే అయ్యే అవకాశాలున్నాయంటూ వెలువడిన జోస్యాలన్నింటిని తలక్రిందులు చేస్తూ ఏకంగా ‘కింగ్’ అయ్యారు దళపతి విజయ్. ఇక ఆయన తమిళనాట అధికారపీఠాన్ని కైవసం చేసుకోవడం లాంఛనమే.
ఎమ్జీఆర్, ఎన్టీఆర్ తర్వాత అరుదైన ఘనత
పార్టీ స్థాపించిన 27నెలల వ్యవధిలోనే అధికార పీఠానికి చేరువ కావడం సామాన్యమైన విషయం కాదు. ఈ కాలంలో ఎన్నో అవరోధాల్ని అధిగమించారు దళపతి విజయ్. ఆయన సినిమా ‘జననాయగన్’ విడుదలను అడ్డుకోవడంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను మసకబరిచే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటన్నింటిని తనదైన ధైర్యం, ఛరిష్మాతో దీటుగా ఎదుర్కొన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఒంటరిగా రాజకీయ రణక్షేత్రంలో అడుగుపెట్టి విజయదుందుభి మోగించారు. కుల, వర్గ సమీకరణాలు శాసించే ఆధునిక భారత రాజకీయంలో తనకు కులం, మతం లేదని ప్రజలకు భరోసా కల్పించారు.
అతను అందరి వాడు అని జనం నమ్మారు కాబట్టే దళపతికి ఈ అపూర్వ విజయం సాధ్యమైంది. డీఎంకే, ఏఐడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను మట్టి కరిపించి ‘తమిళగ వెట్రి కళగం’(TVK) ద్వారా తమిళనాట నూతర రాజకీయ శకానికి నాంది పలికారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్ల తర్వాత దేశంలో ఈ ఘనత సాధించిన సినీ కథానాయకుడిగా చరిత్ర సృష్టించారు దళపతి విజయ్. ఈ నేపథ్యంలో సినీరంగం నుంచి ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ పోరాటపటిమను, అకుంఠిత రాజకీయ దీక్షను కొనియాడుతూ సోషల్‌మీడియాలో అభినందనల వర్షం కురుస్తున్నది.
డియర్ విజయ్.. తొలి ఎన్నికల్లో మీరు సాధించిన ఈ అద్భుత విజయానికి హృదయపూర్వక అభినందనలు. నిరంతరం ప్రేరణగా నిలుస్తూ, నాయకత్వం వహించి సేవ చేయాలని కోరుకుంటున్నా. మీ పాలనలో తమిళ ప్రజలకు మరింత మేలు చేకూరాలని కాంక్షిస్తున్నా
– చిరంజీవి
ప్రముఖ కథానాయకుడు, యువకుడు శ్రీ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయనకే మద్దతుగా నిలిచారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన విజయ్‌ని మనసారా అభినందిస్తున్నా.
-పవన్‌కల్యాణ్
కొత్త చరిత్రను నెలకొల్పి, అద్భుత విజయాన్ని సాధించిన విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు.. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయం ఓ నిదర్శనం. ఈ విజయం తమిళనాడుకు అర్థవంతమైన పురోగతిని అందిస్తుందని నమ్ముతున్నాను..
– మహేశ్‌బాబు
మన రాష్ట్రంలో గతంలో ఇలాంటి విజయమే నమోదైంది. ఇప్పడు పక్క రాష్ట్రంలో అదే తరహాలో విజయ్ విజిల్ మోగించారు. ఎన్నికల ఫలితాలు అంచనాలను తల్లకిందుల చేశాయి. బహశా రాజకీయం అంటే ఇదేనేమో. స్పష్టమైన మెజారిటీని విజయ్‌కి ఇచ్చి, రాష్ర్టాభివృద్ధికి బాటవేసిన తమిళ ప్రజలకు ధన్యవాదాలు
– నాని
ఇంత బలంగా ఓటు వేసేందుకు ముందుకు వచ్చి, తమకోసం తాము నిలబడిన తమిళ ప్రజలకు అభినందనలు. తమిళనాడుకు కాబోవు ముఖ్యమంత్రికి సకల శ్రేయస్సు, సమిష్టి అభివృద్ధి కలగాలని ఆకాంక్షిస్తున్నాను. తమిళ రాజకీయాల కొత్త దశను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నా.
– విజయ్ దేవరకొండ
మీ సంకల్పం, కృషికి తగ్గ చారిత్రాత్మక విజయం ఇది. ఓ గొప్ప వ్యక్తి, ఓ నటుడు ప్రజాభిమానంతో అందరి అంచనాలను తల్లకిందులు చేసినప్పడు కలిగే ఆనందం వేరేలా ఉంటుంది. దక్షిణ భారతంలో ఇది సర్వసాధారణం. తమిళ ప్రజలు భారీ సంఖ్యలో తీర్పు ఇచ్చారు. అందరూ ఎదురు చూస్తున్న మార్పును మీరిస్తారని కోరుకుంటూ.. విజయ్సార్.. మీ అఖండ విజయానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు
– సాయిదుర్గతేజ్
కొన్నిసార్లు మనం చేయాల్సిందల్లా దృఢంగా నిలబడి, జీవితం అన్ని వైపుల నుంచీ విసిరే ప్రతి దెబ్బనూ స్వీకరించడమే.. అలా చేస్తే దాని ఫలితం ఇలా ఉంటుంది.. విజయ్గారికీ, తమిళ ప్రజలకు నా అభినందనలు..
– రామ్ పోతినేని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

