Thalapathy 68 | పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘దళపతి 68’.. స్టార్ కాస్ట్ వీరే
Thalapathy 68 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఓ వైపు లియోతో థియేటర్లలో సందడి చేస్తునే మరోవైపు వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో వస్తోన్న తలపతి 68 (Thalapathy 68) కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనుల్లో భాగంగా అమెరికాను చుట్టి వచ్చిన విషయం తెలిసిందే.
Thalapathy 68 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఓ వైపు లియోతో థియేటర్లలో సందడి చేస్తునే మరోవైపు వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో వస్తోన్న తలపతి 68 (Thalapathy 68) కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనుల్లో భాగంగా అమెరికాను చుట్టి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ టీమ్ దసరా రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియోను, ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు.
ఇక ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) నటిస్తుండగా.. సీనియర్ నటులు ప్రశాంత్ (Prashanth), స్నేహ (Sneha), లైలా, మైక్ మోహన్, ప్రభుదేవా (Prabhudeva), జయరాం, అజ్మల్, యోగిబాబు, వైభవ్, ప్రేమ్ జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుడగా.. 20 ఏళ్ల తర్వాత విజయ్ – యువన్ కలయికలో ఈ సినిమా వస్తుండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో పాన్ ఇండియా స్టోరీతో రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్లో నటిస్తున్నాడని సమాచారం. ఇక ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

