Thalaivar 171 | రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘తలైవా 171’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 (Thalaivar 171)గా ఈ సినిమా రాబోతుండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు
Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 (Thalaivar 171)గా ఈ సినిమా రాబోతుండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ మూవీ నుంచి లోకేష్ సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు.
ఈ మూవీ నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్‌ను లోకేష్ కనగరాజ్ ఎక్స్ వేదికగా విడుదల చేశాడు. ఇక ఈ పోస్టర్లో రజినీకాంత్ లగ్జరీ వాచ్‌లు దొంగతనం చేసే దొంగలా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు లోకేష్ తెలిపాడు. ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
#Thalaivar171TitleReveal on April 22 🔥 pic.twitter.com/ekXFdnjNhD
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 28, 2024
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యులో పాల్గోన్న లోకేష్ మాట్లాడుతూ.. రజనీకాంత్‌తో కలసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తలైవా 171 నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత ‘ఖైదీ 2’ మొదలుపెడతాను అంటూ లోకేష్ వెల్లడించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

