నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘తగ్గేదేలే’. దివ్య పిైళ్లె, అనన్య రాజ్ నాయికలుగా నటిస్తున్నారు. భద్ర ప్రొడక్షన్స్ నిర్మించింది. శ్రీనివాస రాజు దర్శకుడు. రేపు సినిమా విడుదలవుతున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ..‘మూడు కథల సమాహారమే సినిమా. పోరాటం, ప్రతీకారం, ప్రేమ బాగా కుదిరాయి. మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. ‘దండుపాళ్యం’ స్ఫూర్తితో చిత్రాన్ని రూపొందించామని దర్శకనిర్మాతలు తెలిపారు.