తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023 వేడుకలు త్వరలో దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ విశేషాలను టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఆర్కె గౌడ్ తెలియజేస్తూ ‘దుబాయ్‌లో జరగనున్న నంది అవార్డుల వేడుకకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇటీవల దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ ఆఫీస్‌ను ప్రారంభించాం.
దుబాయ్‌లో షూటింగ్స్‌కు అనుమతుల కోసం, లోకేషన్స్ కోసం మా ఆఫీసు నిర్వాహకులు సహాయం అందిస్తారు. త్వరలోనే టీఎఫ్‌సీసీ నంది అవార్డ్ సౌత్ ఇండియాకు ఒక జ్యూరీ కమిటీని నియమిస్తున్నాం’ అన్నారు.