సందేశాత్మక తెప్పసముద్రం
బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం ‘తెప్పసముద్రం’. అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్ జంటగా నటించారు. రవిశంకర్, చైతన్యరావు కీలక పాత్రలు పోషించారు.
బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం ‘తెప్పసముద్రం’. అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్ జంటగా నటించారు. రవిశంకర్, చైతన్యరావు కీలక పాత్రలు పోషించారు. సతీశ్ రాపోలు దర్శకుడు. నీరుకంటి మంజులా రాఘవేందర్‌గౌడ్ నిర్మాత. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి, ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉంటాయని, కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకోసం అందరూ చాలా కష్టపడ్డారని, అందుకే సినిమా బాగా వచ్చిందని నిర్మాత పేర్కొన్నారు. ఇంకా నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

