NTR | తారక్ అభిమానులను టెన్షన్ పెడుతున్న టెంపుల్ సెట్.. కారణం ఏంటంటే?
Devara Movie | 'ఆర్ఆర్ఆర్' వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ఇటీవలే 'దేవర' సెట్లోకి అడుగుపెట్టాడు తారక్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది.
Devara Movie | ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ఇటీవలే ‘దేవర’ సెట్లోకి అడుగుపెట్టాడు తారక్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. లేటెస్ట్గా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. రగ్గుడ్ లుక్‌లో, రక్తపు మరకలతో ఉన్న బ్లాక్ అవుట్ ఫిట్‌లో తారక్ పోస్టర్ అభిమానులనే కాదు, సినీ లవర్స్‌ను సైతం ఉర్రూతలూగించింది. అసలు సిసలైన మాస్ అవతారంలో తారక్‌ను చూపించాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ టెంపుల్ సెట్ లీకై నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మాములుగా అయితే అభిమాన హీరోలకు సంబంధించిన ఫోటోలు లీకైతే పండగ చేసుకుంటారు. కానీ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అదేంటి? టెన్షన్ ఏంటి అనుకుంటున్నారా?. కొరటాల గత సినిమా ఆచార్య ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పినవసరం లేదు. చిరు అభిమానులు సైతం ఈ పేరేత్తితే భయపడుతుంటారు. ఇక ఈ సినిమాలో ఎక్కువగా కనిపించేది టెంపుల్ సెట్. ఇక టెంపుల్ సెట్ పరిసరాల్లోనే సగం సినిమా ఉంటుంది. కాగా దేవరలోనూ అలాంటి టెంపుల్ సెట్ ఉండటంతో తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పెడుతున్నారు. ఆచార్య ఎఫెక్ట్ దేవరపై ఉంటుందా అని భయపడుతున్నారు.
కాగా ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్ కోసం ప్రత్యేకించి టెంపుల్ సెట్‌ను రూపొందించారట. ఇక్కడ జరిగే ఫైట్ సినిమాకే హైలెట్ కానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ఏప్రిల్‌లో ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

