ప్రపంచంలోనే అత్యున్నతంగా, అత్యుత్తమంగా తీసిన సినిమాలకు ఆస్కార్ అవార్డును అందజేస్తారు. ఒక సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అనేది అంత చిన్న విషయం కాదు. ఆస్కార్ అవార్డులు ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకు, కొరియన్, చైనీస్ మూవీస్‌కు వస్తుంటాయి. భారతీయ సినిమాలకు చాలా అరుదగా ఆస్కార్ అవార్డులు వరిస్తుంటాయి.
అయితే.. తాజాగా ఆస్కార్ అవార్డుకు ఒక తెలుగు షార్ట్ మూవీ నామినేట్ అయింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు షార్ట్ మూవీ అదే. దాని పేరు మనసానమః. ఈ షార్ట్ ఫిలింకు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించారు.
విరాజ్ అశ్విన్ లీడ్ రోల్లో నటించాడు. గత సంవత్సరమే యూట్యూబ్‌లో ఈ మూవీని అప్లోడ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాకు 900 అంతర్జాతీయ, రీజనల్ అవార్డ్స్ లభించాయి. ఈ సినిమాను గజ్జల శిల్ప ప్రొడ్యూస్ చేశారు.
ఒక నవలను చదివి.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. నేను ఒక లవ్ స్టోరీని రాసుకున్నాను. కానీ.. నాకెందుకో రివర్స్ స్క్రీన్ ప్లే నా మైండ్‌లో తిరిగింది. అయితే.. ఇలాంటి రివర్స్ స్క్రీన్ ప్లేతో సినిమా తీయడం అనేది చాలెంజింగ్ అనే చెప్పుకోవాలి. కానీ.. దాన్ని నేను చేసి చూపించాను. అది అందరికీ నచ్చింది. అవార్డులను తెచ్చిపెట్టింది. ఆస్కార్ ఓటింగ్‌లో కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నా. త్వరలోనే మరో ఫీచర్ ఫిలింకు దర్శకత్వం వహించబోతున్నా.. అని మనసానమః దర్శకుడు దీపక్ రెడ్డి తెలిపాడు.
తొలిసారి.. దీపక్ నాకు ఈ కథ చెప్పినప్పుడు అసలు అతడు చెప్పిన కథను ఆన్ స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తాడో అనే ఒక చిన్న డౌట్ ఉండేది కానీ.. సినిమా అవుట్ పుట్ చూశాక.. నాకు ఆయన విజన్ కనిపించింది. తమిళం, కన్నడంలో కూడా ఈ ఫిలింను డబ్ చేశాం. ఇప్పటికే ఈ షార్ట్ మూవీకి 900 అవార్డులు వచ్చాయి. ఆస్కార్‌లో కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.. అని ఈ మూవీలో లీడ్ రోల్లో నటించిన విరాజ్ అశ్విన్ స్పష్టం చేశాడు.
ఈ మూవీలో విరాజ్ సరసన ఫిమేల్ లీడ్‌లో నటించిన ద్రిషిక చందర్ మాట్లాడుతూ.. మనసానమహః సినిమానే నా తొలి సినిమా. నా ఫస్ట్ మూవీకే ఇన్ని అభినందనలు, అవార్డులు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ షార్ట్ ఫిలింలో నటించడం అయితే నాకు చాలెంజింగ్‌గా అనిపించింది.. అని చెప్పుకొచ్చింది.
డిసెంబర్ 10, 2021 నుంచి ఈ సినిమా ఆస్కార్ క్వాలిఫికేషన్ కోసం ఓటింగ్ ప్రారంభం అవుతుందని మూవీ యూనిట్ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!