Music Directors | తెలుగు సినిమాలకు పరభాష సంగీత దర్శకులు.. మనవాళ్లు ఏమైపోయినట్లు!
Tollywood Composers | ప్రస్తుతం టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఓ పెద్ద సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ తప్పితే మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఇక మీడియం బడ్జెట్ సినిమాలకైతే ఇదో పెద్ద సమస్యలా మారింది.
Tollywood Composers | ప్రస్తుతం టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఓ పెద్ద సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ తప్పితే మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఇక మీడియం బడ్జెట్ సినిమాలకైతే ఇదో పెద్ద సమస్యలా మారింది. దేవి శ్రీ ప్రసాద్‌కు రెమ్యునరేషన్ ఇచ్చుకోలేరు.. థమన్ ఇప్పుడు చేతినిండా ప్రాజెక్ట్‌లతో తెగ బిజీగా గడుపుతున్నాడు. దాంతో ఇతర భాషల నుంచి సంగీత దర్శకులను మనవాళ్లు దిగుమతి చేసుకుంటున్నారు. మలయాళ సినిమా ‘హృదయం’తో అందరి హృదయాలను కొల్లగొట్టిన హేషమ్ అబ్దుల్ వాహబ్ ప్రస్తుతం తెలుగులో ఖుషీతో పాటు నాని30, శర్వానంద్35వ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.
‘సార్’తో తెలుగు ప్రేక్షకులను సంగీత సాగరంలో ముంచిన జీవి ప్రకాష్ ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన టైగర్ నాగేశ్వరరావుతో పాటు.. నితిన్, వెంకీ కాంబోలో తెరకెక్కుతున్న రొమ్ కామ్, యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఆదికేశవ సినిమాలు చేస్తున్నాడు. దీనితో పాటుగా వెంకీ అట్లూరీ-దుల్కర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా జీవి ప్రకాష్‌నే ఏరి కోరి తీసుకున్నారు. ఇక తమిళంతో పాటు తెలుగులోనూ సమానమైన క్రేజ్ ఉన్న అనిరుధ్ రవిచందర్ దేవర, విజయ్ దేవరకొండ12 సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
కస్టడీతో సో సో మార్కులు సంపాదించుకున్నప్పటికీ యువన్ శంకర్ రాజా విశ్వక్సేన్ 11తో పాటు మరో తెలుగు సినిమా చేస్తున్నాడు. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న హారిస్ జైరాజ్ సైతం తెలుగులో ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. వక్కంతం వంశీ-నితిన్ సినిమాతో పాటు, నాగశౌర్య24వ సినిమాకు హారిస్ సంగీతాలు సమకూర్చే పనిలో ఉన్నాడు. ఇక లెజండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్.. రామ్‌చరణ్16తో పాటు నాగ చైతన్య – చందు మొండేటిల భారీ పాన్ ఇండియా సినిమాకు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. మనదగ్గర అనూప్ రూబెన్స్, మిక్కీ జే మేయర్,భీమ్స్ సిసిరోలియో వంటి కంపోజర్లు ఉన్నా.. పెద్ద సినిమాలను హ్యాండిల్ చేయడంలో తడబడుతున్నారట. దాంతో ఇలా పర భాష సంగీత దర్శకులను ఏరి కోరి మరీ తెచ్చుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

