Telugu Film Chamber | ఫేక్ న్యూస్.. తప్పుడు థంబ్‌నెయిల్స్‌పై ఫిల్మ్ ఛాంబర్ సీరియస్
Telugu Film Chamber Of Commerce | గత కొన్ని ఏండ్లుగా పలు యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రిటీలను టార్గెట్ చేసి తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో పాటు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
Telugu Film Chamber Of Commerce | గత కొన్ని ఏండ్లుగా పలు యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రిటీలను టార్గెట్ చేసి తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో పాటు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ నటి భార్గవి భర్తపై కూడా ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పుడు థంబ్‌నెయిల్ పెట్టి ప్రేక్షకులను మీస్లీడ్ చేశారు. దీంతో ఈ విషయంపై భార్గవి ఆగ్రహాం వ్యక్తం చేయడంతో పాటు ఐడ్రీమ్ నుంచి సమాధానమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాలంటూ భార్గవి డిమాండ్ చేసింది. అయితే సెలబ్రిటీలపై తప్పుడు థంబ్‌నెయిల్స్ మితిమీరుతుండడంతో ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ అయ్యింది. ఇదే విషయంపై సినీ పరిశ్రమలోని ఫిల్మ్, ఫొటో, క్రిటిక్, డిజిటల్ అసోసియేషన్లతో నేడు సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో తప్పుడు థంబ్‌నెయిల్స్ పెడుతున్న యూట్యూబ్ ఛానల్స్‌ను అరికట్టడంతో పాటు ఇటీవల జరిగిన పరిణామలపై చర్చించినట్లు తెలుస్తుంది. సినీ ప్రముఖులపై ఇంటర్వ్యూల పేరుతో అసభ్యకరమైన ప్రశ్నలు.. అనుచిత వ్యాఖ్యలతో కూడిన థంబ్‌నైల్స్ సృష్టించే వారిపట్ల ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకనుంచి తప్పుదోవ పట్టేలా థంబ్‌నెయిల్స్ పెడితే చర్యలు ఏప్రిల్ 01 నుంచి తీసుకోబోతున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

