Rag Mayur | జాతీయ వేదికపై మెరిసిన తెలుగు నటుడు రాగ్ మయూర్.. ‘సివరపల్లి’ సిరీస్‌కు గానూ ఉత్తమ నటుడిగా అవార్డు!
Rag Mayur | ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, మట్టి వాసన వెదజల్లే సహజసిద్ధమైన పాత్రలతో మెప్పిస్తున్న మన తెలుగు నటులు నేడు జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నారు.
Sivarapalli | ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, మట్టి వాసన వెదజల్లే సహజసిద్ధమైన పాత్రలతో మెప్పిస్తున్న మన తెలుగు నటులు నేడు జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నారు. తనదైన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు రాగ్ మయూర్ ముంబై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ (NEXA Streaming Academy Awards) వేడుకలో ఉత్తమ నటుడిగా (బెస్ట్ యాక్టర్) అవార్డును సొంతం చేసుకున్నారు.
అమెజాన్ ఒరిజినల్ సిరీస్ అయిన ‘సివరపల్లి’లో ఆయన పోషించిన అద్భుతమైన పాత్రకు గానూ ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా సినీరంగంలో ఉన్న ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో రాగ్ మయూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ దిగ్గజ నటులు మనోజ్ బాజ్‌పేయి, బోమన్ ఇరానీ వంటి ఉద్ధండులతో పాటు, ప్రఖ్యాత దర్శక ద్వయం రాజ్ & డీకే వంటి ప్రముఖులతో కలిసి ఆయన ఒకే వేదికను పంచుకోవడం విశేషం. తెలుగు ప్రాంతీయ కథలు, ఇక్కడి పాత్రలు నేడు జాతీయ స్థాయిలో ఏ విధంగా ఆదరణ పొందుతున్నాయో చెప్పడానికి ఈ ఘనతే నిదర్శనంగా నిలిచింది. కంటెంట్ బలంగా ఉంటే, అది ప్రజలకు చేరే విధానంలో భాషా బేధాలు అస్సలు అడ్డురావని, కేవలం నటుడి హావభావాలు, పాత్రలో జీవించే తత్వమే ఉన్నత స్థానంలో నిలబెడతాయని రాగ్ మయూర్ విజయంతో మరోసారి నిరూపితమైంది. ప్రాంతీయ పరిధులను దాటి, తన అంకితభావంతో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన రాగ్ మయూర్ విజయం… రాబోయే తరానికి చెందిన ఎంతో మంది యువ నటులకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

