నరేష్ ఆగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘వికటకవి’. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న తొలి డిటెక్టివ్ సిరీస్ ఇది. తెలంగాణలోని అమరగిరి అనే గ్రామాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టిపీడిస్తుంటుంది.
ఆ గ్రామానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. అక్కడి పురాతన కథలను, కుట్రల వెనకున్న రహస్యాలను బయటపెడతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్లేమిటన్నదే ఈ సిరీస్ ఇతివృత్తం. ఇప్పటివరకు రానటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నామని, జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నామని నిర్మాత తెలిపారు.