Devara Movie | దేవర టికెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. అర్ధరాత్రి ఒంటి గంట ఆటకు కూడా..
Devara Movie | యంగ్ టైకర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర. ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ టికెట్స్‌ను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Devara Movie | యంగ్ టైకర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర. ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ టికెట్స్‌ను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 29 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంట షోకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒంటిగంట షోలకు రూ.100 టికెట్ ధర పెంచుకునేందుకు వీలు కల్పించింది. తొలిరోజు ఉదయం 4 గంటల నుంచి షోలు వేసుకునేందుకు అంగీకరించింది. మూవీ విడుదల రోజు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో రూ.100 పెంచుకునే ఛాన్స్ కల్పించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకోవచ్చని చెప్పింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టిఫ్లెక్స్‌లలో రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం రెండుపార్టులుగా తెరకెక్కనున్నది. తొలి పార్ట్ ఈ నెల 27న విడుదలవుతున్నది. ఎన్టీఆర్ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అలనాటి అందాలతార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండడంతో సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు అభిమానులను అలరించాయి. సినిమా ఓపెనింగ్స్‌తో నుంచే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలోని ఇటీవల దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీలో సోమవారం నుంచి టికెట్ల అడ్వాన్స్డ్ బుకింగ్ మొదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

