డిజిటల్ ప్రొవైడర్ల దోపిడీని అరికట్టాలి
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ అయిన క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్డీలు వసూలు చేస్తున్న అధిక యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా బుధవారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో ముగ్గురు నిర్మాతలు స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ అయిన క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్డీలు వసూలు చేస్తున్న అధిక యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా బుధవారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో ముగ్గురు నిర్మాతలు స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ తెలుగు నిర్మాతల నుంచి వారానికి పదివేల రూపాయలను వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో సినిమా రిలీజ్‌కు పదిలక్షల రూపాయలు నిర్మాతలకు భారమవుతున్నది.
పక్కరాష్ర్టాల్లో 3వేల వరకు మాత్రమే ఛార్జీలు వున్నాయి. ముగ్గురు నిర్మాతలు ఈ డిజిటల్ ప్రొవైడింగ్ కంపెనీల్లో పార్ట్‌నర్స్‌గా ఉంటూ ఇండస్ట్రీని లూటీ చేస్తున్నారు. థియేటర్లలో తినుబండారాలకు వందల రూపాయల ఖర్చవుతుంది. టికెట్ రేట్లు భారీగా ఉన్నాయి. దీంతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్లలో సినిమాకు దూరమవుతున్నాడు. డిజిటల్ ప్రొవైడర్ల అధిక ఛార్జీల వసూలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆ నిర్మాతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ సాయివెంకట్, ఏ.గురురాజ్, దర్శకుడు సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

