Teja | తేజ-రానా సినిమా టైటిల్ ఇదే.. కొత్త నటీనటులకు ఛాన్స్
Teja | ఇటీవలే తేజ (Teja) కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రానా దగ్గుబాటి (Rana Daggubati)తో తేజ మరో మూవీ చేయబోతున్నాడన్న ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్లో రానా సినిమా గురించి అధికారికంగా ప్రకటించేశాడు తేజ.
Teja | టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు తేజ (Teja). ఇటీవలే తేజ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా దగ్గుబాటి (Rana Daggubati)తో మరో మూవీ చేయబోతున్నాడన్న ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. రానా సోదరుడు అభిరామ్ హీరోగా అహింస చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రానా సినిమా గురించి అధికారికంగా ప్రకటించేశాడు తేజ.
ఈ క్రేజీ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపాడు తేజ. రానాతో చేయబోయే చిత్రానికి రాక్షస రాజు టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలియజేశాడు. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ను పరిచయం చేసే అతి తక్కువ మంది దర్శకుల్లో తేజ కూడా ఒకరని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సినిమాతో కూడా 45 మంది కొత్త వారిని సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేయబోతున్నానని చెప్పాడు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా తనను సంప్రదించవచ్చన్నాడు. లెజెండరీ నిర్మాత రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10 మంది ఆర్టిస్టులు కావాలని తేజ చెప్పాడు.
రానా-తేజ కాంబోలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షురూ కానుందని సమాచారం. టాప్ హీరో, దేవుడు, జంబ లకిడి పంబ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాలో ఓ ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. అహింస జూన్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

