తేజ్ కూరపాటి, అఖిల జంటగా నటిస్తున్న చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు బి.గోపాల్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వాస్తవికతను దగ్గరగా ఉండే ప్రేమకథా చిత్రమిది. తనికెళ్ల భరణి పాత్రను తాత్విక భావాలతో తీర్చిదిద్దాం. కథానుగుణంగా సంగీతానికి చక్కటి ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు.
విభిన్న ప్రేమకథా చిత్రంగా యువతరాన్ని ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. జీవా, కల్పనా రెడ్డి, జోగి బ్రదర్స్, అనంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.వంశీప్రకాష్, సంగీతం: సందీప్ కుమార్, స్క్రీన్ప్లే, పాటలు: భవ్య దీప్తిరెడ్డి, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకట్ వందెల.