ఆది సాయికుమార్ నటిస్తున్న చిత్రం ‘తీస్మార్ఖాన్’. పాయల్ రాజ్‌పుత్ నాయిక.కళ్యాణ్ జి.గోగణ దర్శకుడు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. ఆగస్టు 19న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన వస్తోంది.
ఆది సాయికుమార్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు సాయికుమార్ పాత్ర హైలైట్‌గా వుంటుంది. ఆది కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. సునీల్, అనూప్‌సింగ్ ఠాకూర్, కబీర్‌సింగ్, పూర్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంగీతం: సాయికార్తీక్.