టాలీవుడ్ యాక్టర్ ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’ (Tees Maar Khan Trailer). నాటకం ఫేం కళ్యాణ్ జీ గోగన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన తీస్మార్ ఖాన్ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 19న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫైనల్ చేశారు.
ఆగస్టు 16న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని The Westin hotelలో ఈవెంట్ నిర్వహించనున్నారు. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. పూర్ణ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్ ఈ చిత్రంలో కీ రోల్స్‌లో నటించారు. తీస్ మార్ ఖాన్‌కు సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్.
ఆది మరోవైపు ఫణి కృష్ణ దర్శకత్వంలో క్రేజీ ఫెలో సినిమా చేస్తున్నాడు. దిగంగనా సూర్యవంశి, మిర్ణా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు ఆది సాయికుమార్.