OG Movie | తెలుగు స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ‘సాహో’ (Saaho) ఫేం సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మూవీ షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఓజీ’ టీమ్ బర్త్ డే విషెస్ తెలుపుతూ ఇమ్రాన్ పోస్టర్ విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ ఒమీ భావు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Team #OG wishes Happy Birthday to their deadliest OMI BHAU… @emraanhashmi #TheyCallHimOG pic.twitter.com/JQcVODf8FI
— Vamsi Kaka (@vamsikaka) March 24, 2024