Family Star | దిల్‌రాజ్ ఆఫీస్‌లో ‘ఫ్యామిలీ స్టార్’ హోమం.. ట్రేడిషనల్ లుక్‌లో విజయ్ దేవరకొండ
Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.
Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. ఎస్వీసీ బ్యానర్లో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ షూరు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ కూడా మార్చి 28న విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ మూవీ విడుదలకు ఇంకా 8 రోజులే ఉండటంతో సినిమా విజయం సాధించాలని హోమం నిర్వహించింది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్. ఎస్వీసీ బ్యానర్ అధినేత దిల్‌రాజ్‌తో పాటు శిరీష్ ఈ హోమం నిర్వహించగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ వచ్చాడు. ఇక హోమంలో పాల్గోన్న విజయ్‌కు వేద పండితులు ఆశీర్వాదం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Divine blessings and positive vibes ✨
Team #FamilyStar conducted a homam at SVC office ❤️#FamilyStarTrailer out tomorrow ❤️🔥❤️🔥#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/wXNjKnV6C7
— Vamsi Kaka (@vamsikaka) March 27, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

