Taraka Ratna | బాలయ్య సినిమాలో తారకరత్న కీలకపాత్ర?
తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నకు స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
Taraka Ratna In Balakrishna Movie | తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నకు స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి గుండె, మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూశారు. ఆయన మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తారకరత్న మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
కాగా తారకరత్న 20ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక తారకరత్న ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అవి రెండు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. అంతేకాకుండా బాలకృష్ణ-అనీల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలకపాత్ర కోసం తారకరత్నను చిత్రబృందం ఫిక్స్ చేశారట. ఈ సినిమాతో తారకరత్న దశ తిరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన అంత్యక్రియలు సోమవారం మాహాప్రస్థానంలో జరుగునున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

