దర్శకుడు క్రిష్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న వెబ్ సిరీస్ ‘9అవర్స్’. నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహిస్తున్నారు. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుషాలినీ, రవివర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, వై.సాయిబాబు నిర్మిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్త్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ ‘ఒక రోజు తొమ్మిది గంటల్లో ఏం జరిగిందనేదాన్ని ఎపిసోడ్స్ రూపంలో చూపిస్తున్నాం. బ్యాంక్ దొంగతనంతో పాటు అనేక ఆసక్తికరమైన అంశాల కలబోతగా కథ నడుస్తుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు. ‘ఈ వెబ్‌సిరీస్‌లో నేను చిత్ర అనే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నా. 80వ దశాబ్దంలో కథ నడుస్తుంది. ధైర్యవంతురాలైన జర్నలిస్ట్‌గా నా పాత్ర స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఆకట్టుకుంటుంది’ అని మధుషాలిని చెప్పింది.