మిషన్ ఇంపాజిబుల్ ప్రపంచంలోకి

బాలీవుడ్లో మహిళా ప్రధాన ఇతివృత్తాలతో సినిమాలు చేస్తూ అగ్రనాయికల రేసులోకి అడుగుపెట్టింది ఢిల్లీ సొగసరి తాప్సీ. హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ సుందరి రెండేళ్ల విరామం తర్వాత తెలుగు చిత్రసీమలో పునరాగమనం చేయబోతున్నది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నా ఆర్ఎస్జే స్వరూప్ నిర్దేశకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తాప్సీ కీలక పాత్రలో నటిస్తోంది. మంగళవారం నుంచి ఆమె చిత్రీకరణలో భాగమయ్యారు. చేతికి బ్యాండేజ్ ధరించిన తాప్సీ వర్కింగ్‌స్టిల్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ‘కథానాయికగా కాకుండా ప్రేక్షకురాలిగా నన్ను నేను తెరపై చూసుకోవడానికి ఇష్టపడే కథల కోసం ఏడేళ్లుగా అన్వేషిస్తున్నా. అలాంటి వాటిలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుంది. కథాబలమున్న నాణ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తాను’ అని తాప్పీ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ: దీపక్ యరగర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

