రాజా విక్రమార్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది చెన్నై భామ తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran). ఈ బ్యూటీ గతేడాది చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన గాడ్ ఫాదర్లో కీలక పాత్రలో మెరిసింది. ఈ భామకు ప్రకృతితో ఫ్రెండ్ షిప్ చేయడమంటే సరదా.
టైం దొరికితే చాలు ప్రకృతిని ఆస్వాదించేందుకు కేటాయిస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి నేచర్ లవర్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ కొత్త లుక్స్‌లో కనిపిస్తూ సందడి చేసే తాన్య రవిచంద్రన్ ఫారెస్ట్ లొకేషన్లోకి వెళ్లింది. పొట్టి డ్రెస్‌లో బ్లాక్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని గ్రీనరీలో షికారు చేసింది. డిఫరెంట్ స్టైల్స్ లో కెమెరాకు ఫోజులిచ్చింది.
తాన్య రవిచంద్రన్ ఫారెస్ట్ ట్రిప్ ఫొటోలు ఇపుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. తాన్య రవిచంద్రన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా.. మరో సినిమాను ఇటీవలే ప్రకటించింది.
గ్రీనరీలో తాన్య రవిచంద్రన్..
తాన్య రవిచంద్రన్ క్యూట్, స్టైలిష్ వాక్.. వీడియో
— Tanya Ravichandran Fc (@TanyaActressFC) January 14, 2023