అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తంత్ర’. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. నరేష్‌బాబు, రవిచైతన్య నిర్మాతలు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను నటుడు ప్రియదర్శి విడుదల చేశారు. ‘ఊరిలో పుట్టిన దుష్టశక్తి రక్తదాహంతో విరుచుకు పడుతున్నది..’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది. దుష్ట శక్తి బారిన పడిన అమ్మాయిగా అనన్య విభిన్నమైన పాత్రలో కనిపించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. క్షుద్రపూజలు, రక్త పిశాచాలు ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తున్నది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం.’ అన్నారు. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్, విజయ్ భాస్కర్ సుద్దాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్.