Ananya Nagalla | మల్లేశం, వకీల్‌సాబ్ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘తంత్ర’. ధనుష్ కథానాయకుడు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. నరేష్ బాబు పి. రవిచైతన్య నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తంత్ర శాస్ర్తానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీలో చర్చిస్తున్నాం. ఫీమేల్ ఒరియెంటెడ్గా తెరకెక్కుతున్న హారర్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు. సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్ఆర్ ధృవన్.