Drugs Case: ఈడీ విచారణకు హాజరైన తనీష్

2017 డ్రగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ముమైత్ ఖాన్, నవదీప్ వంటి వారు విచారణకు హాజరయ్యారు. వీరిని ఈడీ ఐదు గంటల పైనే విచారించారు.
ఇక ఈ రోజు నటుడు తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు? ఎఫ్ క్లబ్లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? డ్రగ్స్ ఎప్పుడైన తీసుకున్నారా? అనే విషయాలపై ఆయనను ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది. అయితే విచారణకు వెళ్లబోయే ముందు మీడియాతో మాట్లాడిన తనీష్.. తనకు కెల్విన్ అనే వ్యక్తితో ఎలాంటి పరిచయాలు లేవని తెలియజేశాడు.ఈడీ విచారణకు సహకరిస్తానని చెప్పాడు. తనీష్ ప్రస్తుతం మరో ప్రస్థానం చిత్రంతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్24న ఈ చిత్రం విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Drugs Case
- Tanish
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

