Tollywood Directors | తమిళంలో ఎత్తర జెండా.. తెలుగోడి సత్తాకు అరవ హీరోలు ఫిదా..!
Tollywood Directors | ఇప్పటి వరకూ మనం తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడమే చూశాం. కానీ.. మన దగ్గర నుంచి దర్శకులు వెళ్లి తమిళ హీరోలతో సినిమాలు చేసింది చాలా అరుదు. అయితే, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు మారుతున్నాయి. నేటి జనరేషన్ దర్శకులు తమిళ్ ఇండస్ట్రీలో హిట్స్ కొడుతున్నారు.
Tollywood Directors | ఇప్పటి వరకూ మనం తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడమే చూశాం. కానీ.. మన దగ్గర నుంచి దర్శకులు వెళ్లి తమిళ హీరోలతో సినిమాలు చేసింది చాలా అరుదు. ఒకప్పుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ (K Viswanath)లాంటి లెజెండరీ దర్శకులు కమల్ హాసన్, మమ్ముట్టి వంటి ఇతర భాష సూపర్ స్టార్లతో సినిమాలు చేశారు. కానీ, గత రెండు దశాబ్దాలలో మన దర్శకులు తమిళ్ ఇంస్ట్రీకి వెళ్లి సినిమాలు చేసిన దాఖలాలు లేవు. అయితే, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు మారుతున్నాయి. నేటి జనరేషన్ దర్శకులు తమిళ్ ఇండస్ట్రీలో హిట్స్ కొడుతున్నారు. తాజాగా మరో తెలుగు దర్శకుడు తమిళనాట తన సత్తా చూపించాడు.
ధనుష్ (Dhanush) హీరోగా వెంకి అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన ‘వాతి’ (Vaathi) సినిమా తమిళం (Tamil)లో సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సినిమా తెలుగులో ‘సార్’ (Sir) పేరుతో వచ్చింది. ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మూడు రోజుల్లోనే 9 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మరోవైపు తమిళంలో కూడా ‘వాతి’ (Vaathi) సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సరైన విజయం కోసం చూస్తున్న ధనుష్(Dhanush) కు చివరికి ఒక తెలుగు దర్శకుడు హిట్ ఇవ్వడం మనవాళ్లకు కాలర్ ఎగరేసే మూమెంట్.

ఇదిలా ఉంటే సంక్రాంతికి విడుదలైన ‘వారసుడు’ (varasudu) సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. దీనికి దర్శకుడు వంశీ పైడిపల్లియ (Vamshi Paidipally). విజయ్ హీరోగా వచ్చిన ‘వారిసు’ (Varisu)సినిమా తమిళంలో రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ ‘వారసుడు’ 15 కోట్ల షేర్ వసూలు చేసి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల విజయాలతో తెలుగు దర్శకులపై తమిళంలో క్రేజ్ పెరిగింది. దానికి తోడు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఇప్పటికే అరవంలో తన జెండా పాతేశారు.

‘బాహుబలి-2’ (Baahubali 2) అక్కడ సినిమాల రికార్డులను కూడా కొల్లగొట్టి రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతోపాటు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కూడా మంచి వసూళ్లు సాధించింది. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కూడా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ధనుష్ (Dhanush)తో ఈయన సినిమా ఓకే అయింది. మొత్తానికి ఈ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ హీరోలందరూ తెలుగు దర్శకుల వెంట పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ సక్సెస్ అందుకుంటున్న టాలీవుడ్ దర్శకులు తమిళ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతారో లేదో చూడాలి మరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

