కావాల్సినంత వినోదాన్నిస్తుంది
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘లవ్ టుడే’. ఇవాన హీరోయిన్గా నటించింది
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘లవ్ టుడే’. ఇవాన హీరోయిన్గా నటించింది. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈనెల 25న నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..‘తమిళనాట చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఏ థియేటర్లో చూసినా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లకు కావాల్సినంత ఫన్ ఈ సినిమా అందించింది. ఈ చిత్రాన్ని చూశాక మొదట రీమేక్ చేద్దామా అనే ఆలోచన వచ్చింది. రీమేక్ చేస్తే ఆ ఫీల్‌ను అందించలేమని అనుకున్నాక నేరుగా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాం. ఈ సినిమా చూసిన వారంతా ఇందులోని ఏదో ఒక పాత్రతో పోల్చుకుంటారు’ అన్నారు.
దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథ్ మాట్లాడుతూ..‘మా మూడేండ్ల కష్టం ఈ సినిమా. తమిళనాట పెద్ద విజయాన్ని సాధించింది. మా సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎదురుచూస్తున్నాను’ అన్నారు. రాధిక మాట్లాడుతూ…‘ఈ కథ వినగానే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పాను. యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి వైవిధ్యమైన కథల్ని ఆదరిస్తారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

