Thalapathy67 | విజయ్-లోకేష్ కనగరాజ్ సినిమాలో తమిళ స్టార్ డైరెక్టర్?
ఫలితం ఎలా ఉన్నా విజయ్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. గతేడాదీ 'బీస్ట్'తో అభిమానులను నిరాశపరిచిన విజయ్.. ఈ ఏడాది 'వారసుడు'తో ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
Thalapathy67 Movie | ఫలితం ఎలా ఉన్నా విజయ్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. గతేడాదీ ‘బీస్ట్’తో అభిమానులను నిరాశపరిచిన విజయ్.. ఈ ఏడాది ‘వారసుడు’తో ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే.. లోకేష్ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్ళాడు. ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది. మాస్టర్ తర్వాత వీరిద్ధరి కలిసి చేస్తు్న్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ డైరెక్టర్ మిస్కిన్ ఓ కీలకపాత్ర పోషించనున్నాడట. అందుకోసం మిస్కిన్ 22రోజులు కాల్షీట్లు ఇచ్చాడట. ఇక విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో లోకేష్ ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడట. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడం లేదట. ముఖ్యంగా నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. రోల్‌కు సరిపోయే వాళ్ళనే ఎంపిక చేస్తున్నాడట. ఇప్పటికే గౌతమ్ మీనన్, సంజయ్ దత్, ప్రథ్వీరాజ్, నివిన్ పాలీ వంటి ఆయా ఇండస్ట్రీలో టాప్ నటులుగా కొనసాగుతున్న వాళ్ళను ఎంపిక చేశాడు.
రోజు రోజుకు ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడని టాక్. విక్రమ్‌తో విధ్వంసం సృష్టించిన లోకేష్ కనగరాజు.. ఈ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

