Vishal | పెళ్లి వార్తలు అవాస్తవం
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు తమిళ హీరో విశాల్. కథానాయిక లక్ష్మీమీనన్ను ఆయన పెళ్లాడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి.
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు తమిళ హీరో విశాల్. కథానాయిక లక్ష్మీమీనన్ను ఆయన పెళ్లాడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. వీటిపై విశాల్ మాట్లాడుతూ ‘నా గురించి రాసే తప్పుడు వార్తలపై నేను సాధారణంగా స్పందించను. కానీ ఒక అమ్మాయిని అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగడం వల్లే స్పందించాల్సి వస్తున్నది. ఇలాంటి పుకార్ల ద్వారా ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితానికి, పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నారు.
నా పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా పెళ్లి విషయం పెద్ద రహస్యం ఏమీ కాదు. సమయం వచ్చినప్పుడు నా పెళ్లి గురించి నేనే అధికారికంగా ప్రకటిస్తాను’ అని విశాల్ పేర్కొన్నారు. విశాల్, లక్ష్మీమీనన్ కలిసి తమిళంలో రెండు చిత్రాల్లో నటించారు. దాంతో వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్మీడియాలో వార్తలొచ్చాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

