Puneeth Tribute |పునీత్ బదులు నేను చచ్చిపోయినా బాగుండేది.. ఆ హీరో ఎమోషనల్
పునీత్ బదులు నేను చచ్చిపోయినా బాగుండేది | దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగింది
దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఇంతకు ముందు ఆయన నటించిన ఎన్నో సినిమా వేడుకలు అదే గ్రౌండ్ లో జరిగాయి. ఇప్పుడు అదే వేదికపై ఆయన శ్రద్ధాంజలి సభ జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. ఈ సభ మొదలైనప్పటి నుంచి అందరి కళ్ళలో కన్నీరు కనిపించింది. తమను ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళిపోయినా కన్నడ యువరత్నను తలచుకొని అక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు.. కోట్లాదిమంది కన్నడిగులు కన్నీరు కార్చారు. అక్టోబర్ 29న గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.

ఆయన మరణం జీర్ణించుకోలేక దాదాపు 21 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారంటే అతడిపై ఎంతటి ప్రేమ పెంచుకున్నారో అర్థమవుతుంది. అంతే కాదు నాడు మహాత్మాగాంధీ అంత్యక్రియలకు దాదాపు 20 లక్షల మంది హాజరైతే.. మొన్న పునీత్ అంత్యక్రియలకు ఏకంగా 25 లక్షల మంది హాజరయ్యారు. ఇదొక్కటి చాలు పునీత్ కన్నడనాట ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడో చెప్పడానికి. ఈయన మరణించి 20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు కన్నడిగులు. తాజాగా జరిగిన సంస్మరణ సభలో అతిరథ మహారథులు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప సహా ఎంతో మంది రాజకీయ నాయకులు పునీత్ సంస్మరణ సభలో కనిపించారు. సినీ ఇండస్ట్రీ అంతా ఈ సభలో ఉన్నారు.
తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచు మనోజ్ అక్కడికి వెళ్లి పునీత్ గురించి మాట్లాడారు. ఇదిలా ఉంటే తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ సభలో ఎమోషనల్ అయ్యారు. నాలుగేళ్ల కిందట వచ్చిన రాజకుమార సినిమాలో పునీత్ రాజ్ కుమార్ తండ్రిగా నటించాడు శరత్ కుమార్. ఆ సినిమా కన్నడనాట ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్ లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు శరత్. పవర్ స్టార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన బదులు తాను చనిపోయినా బాగుండేది అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఇదే వేదికపై రాజకుమార 100 రోజుల వేడుక జరిగిందని.. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అని కన్నీరు పెట్టుకున్నాడు శరత్ కుమార్. తన శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నానని.. కానీ ఆయన శ్రద్ధాంజలి తాను రావాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ దేవుడు పునీత్ రాజ్ కుమార్ బదులు తనను తీసుకెళ్లినా బాగుండు అంటూ స్టేజిపై ఏడ్చేశాడు శరత్ కుమార్. ఈయన మాటలు విన్న శివన్న కూడా కన్నీరు పెట్టుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Puneeth Rajkumar Award | దివంగత పునీత్ రాజ్కుమార్కు అరుదైన గౌరవం
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

