Cheran | సినిమా షూటింగ్లో ప్రమాదం.. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తలకు గాయాలు
Cheran | తమిళ చిత్ర షూటింగ్లో ప్రమాదం జరిగింది. 4 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్, నటుడు చేరన్ గాయపడ్డాడు. తలకు 8 కుట్లు పడ్డాయి.

Cheran | సినిమా షూటింగ్లో ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువైపోయాయి. కొద్దిరోజుల క్రితం భారతీయుడు 2 సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం జరగ్గా.. ఇటీవల విశాల్ కూడా షూటింగ్ సమయంలో ఓ ప్రమాదానికి గురయ్యాడు. ఇప్పుడు తాజాగా మరో తమిళ చిత్ర షూటింగ్లో ప్రమాదం జరిగింది. నాలుగుసార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్, నటుడు చేరన్ గాయపడ్డాడు.

నంద పెరియాస్వామి దర్శకత్వంలో కడలి ఫేమ్ గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న తెరకెక్కుతున్న ఆనందం విలయటం వీడు అనే సినిమాలో చేరన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో భాగంగా ఇంటిపై షూటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంటి పైకప్పుపై నుంచి కాలుజారి చేరన్ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో చేరన్ తలకు బలమైన గాయమైంది. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అతని తలకు 8 కుట్లు కూడా పడ్డాయట. అయితే ఆస్పత్రి నుంచి తిరిగొచ్చిన తర్వాత చేరన్ మళ్లీ షూటింగ్లో పాల్గొనడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నేను చచ్చిపోయుంటే బాగుండేది.. అనవసరంగా బతికున్నా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
తన భర్త నచ్చిన ప్లేస్‌లో ఉన్నాడని చెప్పిన ప్రియాంక
బిగ్ బాస్ ఎంట్రీపై సురేఖా ఏం చెప్పిందంటే..!
సాహసం చేస్తున్న తమన్నా.. అభినందించాల్సిందే అంటున్న నెటిజన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

