Tamannah Bhatia | తొలి మహిళా బౌన్సర్ పాత్రలో తమన్నా..నెట్టింట పోస్ట్ వైరల్
తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తమన్నా భాటియా (Tamannah bhatia). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ రీసెంట్గా మూడు హిందీ సినిమాలను పూర్తి చేసింది.
శ్రీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ముంబై బ్యూటీ తమన్నా భాటియా (Tamannah bhatia). ఆ తర్వాత తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ రీసెంట్గా మూడు హిందీ సినిమాలను పూర్తి చేసింది. వీటిలో ఒకటి. ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer). తొలి మహిళా బౌన్సర్ (First Female Bouncer)జీవిత కథ ఆధారంగా వస్తోందీ ప్రాజెక్టు. ఈ సినిమా పూర్తయిన సందర్భంగా నెట్టింట ఓ పోస్టు పెట్టింది తమన్నా.
బబ్లీ బౌన్సర్ నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. ఎప్పటికీ గుర్తుండిపోయే..జీవితకాలపు అనుభూతిని ఇచ్చిన ప్రాజెక్టు. రచయిత బ్యాక్ బోన్‌గా ఉండి రాసిన బలమైన పాత్రతో ఈ సినిమా షురూ అయింది. ఈ చిత్రం ఓ యాక్టర్ గా అన్ని విధాల తనను తాను చూపించుకోగలిగే సరైన ప్రాజెక్టు. బబ్లీ పాత్రతో ప్రేక్షకుల మనస్సులోకి చొచ్చుకునిపోయే ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నించానంది తమన్నా.
బబ్లీ బౌన్సర్ సినిమా చిత్రీకరణ సమయంలో నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు, మంచితనం, సానుకూలత, మద్దతు, స్ఫూర్తివంతమైన వ్యక్తులతో నిండిన నిజ జీవితాన్ని కూడా సృష్టించాము..అందులోనే జీవిస్తున్నాము. ఈ ఎనర్జీ నా భావోద్వేగాలను సిల్వర్ స్క్రీన్‌పై ట్రాన్స్ ఫార్మేషన్ చేసేందుకు సహాయపడిందని తమన్నా చెప్పుకొచ్చింది.
బబ్లీ బౌన్సర్ మేకింగ్‌లో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిజంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. నా దర్శకుడు మాధుర్ బండార్కర్ (Madhur Bhandarkar) సార్‌కు , నా కోస్టార్లు, నా టీం మెంబర్స్, రాత్రి, పగలు కష్టపడి పనిచేసిన ప్రతి విభాగానికి కృతజ్ఞతలు అని పోస్ట్ లో రాసుకొచ్చింది తమన్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

