వారికి లీగల్ నోటీసులు పంపిన తమన్నా.. యాంకర్ అనసూయనే కారణమా?

tamannaah and anasuya bharadwaj | ఇన్నాళ్లు హీరోయిన్గా అలరించిన తమన్నా యాంకర్‌గాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.
రాను రాను షోకి ఆదరణ దక్కకపోవడంతో తమన్నా స్థానంలో అనసూయని తీసుకున్నారు.అనసూయ రంగ ప్రవేశంతో ఈ షో మంచి రేటింగ్ సాధిస్తుందనే ఆశాభావంతో ప్రొడక్షన్ హౌస్ ఉన్నట్టు సమాచారం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్ హౌస్‌కు తమన్నా షాకిచ్చింది. తనను తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తమన్నా .. ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారట. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసుల్లో పేర్కొన్నారు అని వెల్లడించింది.
2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత తమన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. రెడీ, 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబాలి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో చివరగా సీటీమార్, మాస్ట్రో సినిమాలో నటించి మెప్పించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anasuya
- master chef
- tamannah
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

