హ్యాకర్ అనురాధ

ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు ప్రయోగాత్మక, నవ్యమైన కథాంశాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. అగ్ర కథానాయికలు సైతం తమ అభిరుచుల్ని ప్రతిబింబించే ఇతివృత్తాల్ని ఎంచుకుంటూ వెబ్‌సిరీస్‌లలో సత్తా చాటుతున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా అదే పంథాను అనుసరిస్తోంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఓటీటీ వేదికలపై కూడా మెప్పిస్తోతంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తమిళ వెబ్‌సిరీస్ ‘నవంబర్ స్టోరీ’ టీజర్ గురువారం విడుదలైంది. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో తమన్నా ఎథికల్ హ్యాకర్ అనురాధగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నది. ఓ హత్య విషయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న తండ్రిని రక్షించడానికి తన శక్తియుక్తుల్ని ప్రదర్శించే యువతిగా తమన్నా పాత్ర ఛాలెంజింగ్‌గా సాగుతుందని చెబుతున్నారు. తన కెరీర్లో సంతృప్తినిచ్చిన పాత్రల్లో ఇదొకటని తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘అనురాధ స్వతంత్య్ర భావాలు కలిగిన ధైర్యవంతురాలైన అమ్మాయి. తండ్రిని రక్షించుకోవడానికి ఎలాంటి పోరాటం చేసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. శక్తివంతమైన మహిళ పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది. తమన్నా నటించిన తొలి తమిళ వెబ్‌సిరీస్ ఇదే .ఈ సిరీస్‌కు రామసుబ్రమణియన్ దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- november story
- tamannah
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

