Tamanna | మోహన్‌బాబు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా నక్షత్రాల పాలపుంతను తలపిస్తున్నది. మంచు విష్ణు టైటిల్‌రోల్ చేస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో సూపర్స్టార్లయిన శివరాజ్‌కుమార్, అక్షయ్‌కుమార్, ప్రభాస్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సూపర్‌స్టార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరారట. ఆయనే మోహన్‌లాల్.
ఇందులో ఆయన ఆదివాసీ తెగకు చెందిన ఓ నాయకుడిగా కనిపిస్తారని వినికిడి. ఇదిలావుంటే.. తమన్నా భాటియా కూడా ‘కన్నప్ప’లో భాగం అయినట్టు తెలుస్తున్నది. ఇందులో ఓ ప్రత్యేక గీతంలో ఆమె మెరవనున్నదట. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ‘కన్నప్ప’లో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేస్తున్నదని ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే.. ఆ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ముఖేష్‌కుమార్ సింగ్
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.