Tamannaah | మిల్కీ బ్యూటీ తమన్నా పేరు చెబితే చాలు యువత గుండె వేగం పెరుగుతుంది. గ్లామర్‌తో కుర్రకారును, డ్యాన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టింది. నెగెటివ్ క్యారెక్టర్ చేయడానికీ వెనుకాడబోనని ‘మ్యాస్ట్రో’ సినిమాతో నిరూపించుకుంది. కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ రోల్స్ చేయడానికి ఏమాత్రం ఆలోచించని తమన్నా.. ముద్దు సీన్లకు కాస్త దూరంగానే ఉంది.
అయితే, తాజాగా ఆ హద్దులను కాస్తా చెరిపేసింది. ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లలో శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిందీ భామ. దానిపై ట్రోల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. అయితే, వాటిపై తమన్నా చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. ‘నటిగా అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలి కదా! ఆ ఉద్దేశంతోనే శృంగార సన్నివేశాల్లో నటించకూడదని పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేశాను.
ముద్దు సీన్లలో నటించే సమయంలో హీరోయిన్లు చాలా ఇబ్బంది పడతారు అని చాలామంది అనుకుంటారు. అయితే, అలాంటి సన్నివేశాల్లో నటించడానికి హీరోయిన్ల కంటే మగవాళ్లే ఎక్కువగా టెన్షన్ పడతారు. తోటి నటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తారు. హీరోయిన్లు ఏమనుకుంటారో అనే భావనతో ఒత్తిడికి లోనవుతుంటారు. దీనివల్ల ఆ సన్నివేశంపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. నటీనటులిద్దరూ ముందుగా ఒక అండర్స్టాడింగ్కు రావాలి. అప్పుడే ఏ ఇబ్బందీ లేకుండా ఆ సన్నివేశం పండుతుంద’ని కామెంట్ చేసింది.