Tamannaah Bhatia | సీన్ టు సీన్ రీమేక్ చేయలేదు.. భోళాశంకర్‌పై తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Tamannaah Bhatia | చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా, సుశాంత్, మెహర్ రమేశ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Tamannaah Bhatia | కొన్నాళ్లుగా నెట్టింట తమన్నా ఫీవర్ నడుస్తోంది. ఎందుకనేది నెటిజన్లు, మూవీ లవర్స్‌కు ఇప్పటికే అర్థమై ఉంటుంది. తమన్నా ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోండగా.. వీటిలో ఒకటి టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెహర్‌రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆగస్టు 11న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా, సుశాంత్, మెహర్ రమేశ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిట్‌చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది తమన్నా. సీన్ టు సీన్ వేదాళమ్ రీమేక్ చేయలేదని చెప్పింది. వేదాళమ్ థీమ్‌ను మిస్సవకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా, వారికి నచ్చేలా మెహర్ రమేశ్ తెలుగు వెర్షన్‌ను రీక్రియేట్ చేశారని చెప్పింది. వేదాళమ్కు మరో వెర్షన్‌లా భోళాశంకర్ ఉంటుంది. ఎక్కువగా సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండటమే కాకుండా.. ఈ మూవీ ఏకే ఎంటర్టైన్మెంట్స్లో రావడం స్పెషల్ అని చెప్పుకొచ్చింది తమన్నా. మిల్కీ బ్యూటీ కామెంట్స్‌తో సినిమా క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది.
ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన భోళాశంకర్ గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్ లో సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భోళా శంకర్ హైదరాబాద్, కోల్‌కతా, స్విట్జర్లాండ్‌తోపాటు పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తమన్నా మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్‌లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది.
డబ్బింగ్ స్టూడియోలో చిరంజీవి..
So it’s a wrap for #BholaaShankar dubbing!
Very pleased to see how the film has shaped up. It is a sure fire mass entertainer and will appeal to the audiences in a big way! Mark your calendars! See you at the Movies!! #BholaaShankarOnAug11 pic.twitter.com/3ufoWJAwqp— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2023
జైలర్ ఈవెంట్లో తమన్నా మెరుపులు..
— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 29, 2023
మిల్కీ బ్యూటీ ప్రోమో..
సంగీత్ సాంగ్ షూటింగ్ ఇలా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

