కొన్నాళ్ల క్రితం కొంచెం కంట్రోల్లోనే ఉండేది తమన్నా. ఈ మధ్య మాత్రం సినిమాల్లోనూ సిరీసుల్లోనూ చెలరేగిపోయిమరీ అందాలు ఆరబోస్తున్నది. ఐటమ్ పాటల్లో తళుక్కున మెరుస్తూ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది తమన్నా. మొన్నామధ్య రజనీకాంత్ ‘జైలర్’లో ‘రా నువ్ కావాలయ్యా.. కావాలీ..’ అంటూ చేసిన హంగామాను అంత తేలిగ్గా మరిచిపోగలమా?. ఇప్పుడు అలాంటి హంగామాకే మళ్లీ తెరలేపిందట మిల్కీబ్యూటీ తమన్నా.
బాలకృష్ణ, కె.ఎస్.రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో ఓ ఐటమ్‌సాంగ్‌లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట తమన్నా. ఆ పాట సినిమాకే హైలైట్‌గా నిలువనున్నదని టాక్. ఇదే గనక నిజమైతే బాలయ్యతో తమన్నా చేస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. బాలయ్య రీసెంట్ హిట్ ‘భగవంత్ కేసరి’లో కాజల్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా వంతు వచ్చిందన్నమాట. అయితే హీరోయిన్గా కాదు, ఐటమ్ సాంగ్‌కి మాత్రమే అని టాక్. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.