Tamanna | మర్డర్ సీన్స్ చూడటానికే భయపడే నేను ఇప్పుడు హత్య చేయాల్సివచ్చింది

‘అరుణ్ ఓ అంధుడు. పియానో కళాకారుడైన అతడి జీవితంలో ప్రపంచానికి తెలియని చాలా రహస్యాలుంటాయి. అవేమిటి? అతడి జీవితంలోకి ప్రవేశించిన ఓ మహిళ కారణంగా అరుణ్ ఎలాంటి కష్టాలు పడ్డాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు మేర్లపాక గాంధీ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మాస్ట్రో’. నితిన్, నభానటేష్ జంటగా నటిస్తున్నారు. ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. తమన్నా కీలక పాత్రధారి. డిస్నీ హాట్‌స్టార్ ద్వారా త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. అంధత్వం కారణంగా నితిన్‌కు ఎదురయ్యే సమస్యలతో సరదాగా ట్రైలర్ మొదలైంది. అతడి జీవితాన్ని మార్చే మహిళగా తమన్నా పాత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘సినిమాల్లో మర్డర్ సీన్స్ చూడటానికే భయపడే నేను ఇప్పుడు హత్య చేయాల్సివచ్చింది’ అని తమన్నా చెప్పే డైలాగ్ ఉత్కంఠను పంచుతోంది. రొమాన్స్, కామెడీ, సస్పెన్స్ మేళవిస్తూ సినిమాను రూపొందించారు. నరేష్, జిషుసేన్‌గుప్తా, శ్రీముఖి, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, ఛాయాగ్రహణం: జె. యువరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Maestro
- nabha natesh
- nitin
- tamanna
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

